ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ కోసం ఎంతో చేశారని సినీ హీరో విజయ్ దేవరకొండ అన్నారు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ట్విటర్ వేదికగా ఈ యువహీరో కేసీఆర్‌కు శుభాకాంక్షలు చెప్పారు. ‘మీరు ఈ రాష్ట్రం కోసం.. రాష్ట్ర ప్రజల కోసం.. నీటి కోసం.. విద్యుత్తు కోసం.. పచ్చదనం కోసం.. అభివృద్ధి కోసం ఎంతో పోరాడారు. మీరు ఆరోగ్యంతో ఉంటూ మాకోసం ఇలాగే పోరాడుతూ రాష్ట్రాన్ని నడిపించాలని కోరుకుంటున్నా’ అని విజయ్ ట్వీట్ చేశారు. గతంలో కేసీఆర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న ఫొటోలను విజయ్ పంచుకున్నారు.
‘నువ్విలా’ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన విజయ్.. ‘పెళ్లి చూపులు’తో హీరోగా మారారు. ఆ తర్వాత ఆయన నటించిన ‘అర్జున్‌రెడ్డి’, ‘గీతా గోవిందం’, ‘టాక్సీవాలా’ మంచి విజయాలు నమోదు చేశాయి. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు. ఆ సినిమా సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అలరించనుంది.
You fought for this state, its people, its water, its electricity, it staying green, its development 🙂
I wish you a happy birthday and wish you great health, wish you to keep fighting for us and leading the state!#HappyBirthdayKCR garu 🤗🙏🏼 pic.twitter.com/VI1YyeENwm
— Vijay Deverakonda (@TheDeverakonda) February 17, 2021