టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ, వరల్డ్ ఫేమస్ లవర్ లాంటీ డిజాస్టర్ సినిమా తర్వాత స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్‌లో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రానికి ముందుగా ‘ ఫైటర్’ పేరు అనుకున్నారు. కానీ ఆ సినిమా టైటిల్‌ను హృతిక్ రోషన్ బుక్ చేసుకోవడంతో వేరే టైటిల్ను పరిశీలించారు. తాజాగా పాన్ ఇండియా రిలీజ్కి అనుగుణంగా ఉండేవిధంగా ఈ సినిమాకు ‘లైగర్’ అనే టైటిల్ ఖరారు చేసారు. ఈ సినిమాను ఛార్మి, కరణ్ జోహార్‌లు కలిసి నిర్మిస్తున్నారు. తెలుగు హిందీ భాషాల్లో మాత్రమే కాకుండా ఇండియాలోని ప్రధాన భాషాల్లో ఈ సినిమా విడుదలకానుంది.

సింహం మరియు పులికి పుట్టిన జంతువును లైగర్ అని పిలుస్తారు. అలా హీరో క్యారెక్టర్‌లో పులి మరియు సింహం రెండూ ఉన్నాయి అనే విధంగా పోస్టర్ వెనుక ఒకవైపు సింహాన్ని ఒకవైపు పులిని పెట్టారు. అయితే లైగర్ అనే పదం అర్థం తెలియని వారు, సినిమా టైటిల్ అర్థం కాక, ఇదెక్కడి మూవీ టైటిల్ అని చెప్పుకుంటున్నారు.
ఈ చిత్రంలో విజయ్‌కు జోడిగా బాలీవుడ్ నటి అనన్య పాండే నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ముంబైతో పాటు విదేశాల్లో కూడా జరుగుతోంది. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తున్నాడు.