దేశంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తోంది. నిత్యం లక్షల్లో కేసులు వెలుగులోకి వస్తున్నాయి. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకూ అందరూ కరోనా బారిన పడుతున్నారు. తాజాగా మరో నటుడు కరోనా బారిన పడ్డాడు. రియల్ హీరో సోనూసూద్‌కు కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఈ మేరకు ఆయన ట్విట్ చేసి వెల్లడించాడు. ఆయన కోలుకోవాలంటూ అభిమానులంతా సోషల్ మీడియాలో ప్రార్థిస్తున్నారు. గతేడాది కరోనా విపత్కర పరిస్థితుల్లో సోనూసూద్ వేలాది మందికి ప్రత్యేక్షంగా సాయం చేసి అందరి మన్ననలు పొందాడు. శనివారం మధ్యాహ్నం తనకు కోవిడ్-19 పాజిటివ్ గా నిర్థారణ అయినట్లు సోనూసూద్ ట్విట్ చేశాడు.
— sonu sood (@SonuSood) April 17, 2021