టాలీవుడ్ బెస్ట్ కపూల్ లిస్టులో అక్కినేని నాగచైతన్య, సమంత ఒకరు.. సుదీర్ఘ ప్రేమాయణం తర్వాత పెళ్లి పీటలెక్కిన ఈ జంట చట్టపట్టాలేసుకుంటూ తిరుగుతున్నారు. తాజాగే ఈ జంట మరో సార్ మీడియా కంట పడ్డారు. తాజాగా చైతూ తన భార్య సమంతను కారులో డ్రైవ్‌కు తీసుకెళ్లాడు. ఈ స్టార్ కపుల్ తమ కారులో డ్రైవ్ కెళ్ళిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
ఫోటోలు చూస్తుంటే సమంత చైతూలు చాలా హ్యాపీగా నవ్వుతూ కనిపిస్తున్నారు.తాజాగా ఈ జంట కొత్త రాయల్ బ్లూ మెర్సిడెస్ బెంజ్ లగ్జరీ కారు కొనుగోలు చేసి షార్ట్ రైడ్ కువెళ్లారట. ఇక సినిమాల విషయానికొస్తే చైతన్య నటించిన లవ్ స్టోరీ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే విక్రమ్ కుమార్ తో థాంక్యూ అనే సినిమా చేస్తున్నాడు. ఇక సామ్ విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో కాతువకుల రెండు కాదల్ సినిమా చేస్తోంది. తెలుగు తమిళంలో రూపొందనున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి నయనతార నటిస్తున్నారు.