సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏ చిన్న విషయం అయినా ఇట్టే వైరల్ అవుతుంది. సోషల్ మీడియా ద్వారా ఎంత మంచి జరుగుతుందో… అంతే చెడు కూడా జరుగుతుంది. అయితే ఇటీవల బాలీవుడ్ విలక్షణ నటుడు పరేష్ రావల్ చనిపోయాడంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే విషయమై కొన్ని వెబ్ మీడియా సంస్థలు కూడా వార్తలు రాసాయి. కాగా ఇదే విషయమై పరేష్ రావల్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు.
తాను మరణించినట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని పరేష్ అన్నారు. ఉదయం ఎనిమిది గంటల సమయంలో సినీ నటుడు పరేష్ రావల్ చనిపోయాడంటూ వచ్చిన వార్తలను ట్వీట్ చేస్తూ…. క్షమించాలి నేను ఆ సమయంలో నిద్రపోతున్నాను. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. అంటూ కామెంట్ పెట్టారు పరేష్ . దీంతో పరేష్ మృతి చెందలేదన్న వార్త విని అభిమానులు అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఇటీవల చాలా మంది సినీ స్టార్స్ కరోనా తో చనిపోయిన సంగతి తెలిసిందే.
🙏…Sorry for the misunderstanding as I slept past 7am …! pic.twitter.com/3m7j8J54NF
— Paresh Rawal (@SirPareshRawal) May 14, 2021