ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ స్మార్ట్ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకోవడానికి సరికొత్త యాప్ తో ముందుకొచ్చింది. టిక్ టాక్ కు చెక్ పెట్టేలా తాజాగా ఫాస్ట్ లాఫ్స్ యాప్ ను ప్రారంభించింది. ఈ యాప్ మొబైల్ వినియోగదారులకు కామెడీ కేటలాగ్ నుండి ఫన్నీ క్లిప్‌ల ను , స్క్రీన్ ఫీడ్‌ను అందిస్తుంది. అయితే ఈ ఫాస్ట్ లాఫ్స్, ప్రస్తుతం కొన్ని దేశాల్లో మాత్రంలో అందుబాటులోకి వచ్చింది. ఇక iOS స్మార్ట్ ఫోన్లలో మాత్రమే పనిచేస్తుంది. ఇది కూడా టిక్‌టాక్ , ఇన్స్టాగ్రామ్ లా కనిపిస్తుంది.
ఈ యాప్ లో ఆసక్తిని, హాస్యాన్ని కలిగించే చిన్న చిన్న వీడియోలు , పలు ప్రదర్శన్లోని ముఖ్య సన్నివేశాలు, కామెడీ యాక్టర్స్ వీడియో క్లిప్స్ నెట్‌ఫ్లిక్స్ యాప్ ద్వారా అనుసంధానమై నేరుగా ప్లే అవుతాయి. అంతేకాదు వినియోగదారులు కూడా తమకు నచ్చిన ప్రదర్శనలు, చలనచిత్రాలు, ప్రత్యేకతను తెలియజేస్తూ ఆసక్తిని రేకెత్తించే అంశాలు కూడా అప్ లోడ్ చేయవచ్చునని నెట్‌ఫ్లిక్స్ ఓ ప్రకటనలో తెలిపింది.