• సినిమా వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వార్తలు
  • పీపుల్
Wednesday, May 18, 2022
Telugu News - Telugu Times Now
  • సినిమా వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వార్తలు
  • పీపుల్
ENGLISH
No Result
View All Result
Telugu News - Telugu Times Now
ENGLISH
No Result
View All Result
Home వార్తలు

ఫేస్ బుక్ పేరు మార్చబోతున్న జుకర్ బర్గ్..!

by Alapati Anitha
October 20, 2021
in వార్తలు
0
ఫేస్ బుక్ పేరు మార్చబోతున్న జుకర్ బర్గ్..!

Facebook CEO Mark Zuckerberg speaks during a press conference in Paris on May 23, 2018. (Photo by BERTRAND GUAY / AFP)

ఫేస్ బుక్.. నేటి తరానికి పరిచయం అక్కర్లేని పేరు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది దాని ద్వారా అనుసంధానమవుతున్నారు. లక్షలాది మంది వ్యాపారాలు చేసుకుంటున్నారు. అంతలా అందరికీ చేరువైన ఆ ‘ఫేస్ బుక్’ పేరు మారిపోతోందని తెలుస్తోంది. వచ్చే వారం కొత్త పేరును సంస్థ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ప్రకటించనున్నట్టు సమాచారం.

ఈ నెల 28న నిర్వహించే సంస్థ వార్షిక సదస్సు కనెక్ట్ లో ఆ వివరాలను జుకర్ బర్గ్ వెల్లడించనున్నట్టు చెబుతున్నారు. ‘హొరైజన్’ అనే పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. వర్క్ ప్లేస్ కొలాబరేషన్ కోసం ఫేస్ బుక్ ఇటీవల ‘హొరైజన్ వర్క్ రూమ్స్’ అనే కాన్సెప్ట్ ను పరిచయం చేసింది. దీంతో ఆ సంస్థ పేరు ‘హొరైజన్ వరల్డ్స్’ అయి ఉండొచ్చన్న వాదనా వినిపిస్తోంది.

తాము కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాదని, ఫేస్ బుక్ గొడుగు కింద ఇంకా చాలా ఉన్నాయని చెప్పేందుకే పేరును మార్చుతున్నారన్న చర్చ జరుగుతోంది. దీనిపై ఇప్పుడే స్పందించేందుకు ఫేస్ బుక్ ప్రతినిధి నిరాకరించారు. ఇప్పటికే వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్, ఆక్యులస్ వంటివి ఫేస్ బుక్ లో భాగంగా ఉన్నాయి. ఏఆర్ (ఆగ్మెంటెడ్ రియాలిటీ) అద్దాల తయారీలో సంస్థ బిజీగా ఉంది. దాదాపు 10 వేల మంది ఉద్యోగులు దానిపై పనిచేస్తున్నారు. స్మార్ట్ ఫోన్లలాగానే ఏదో ఒక రోజు ఏఆర్ గ్లాసెస్ కూడా అందరి జీవితాల్లో భాగమైపోతాయని జుకర్ బర్గ్ భావిస్తున్నారు.

కాగా, సంస్థలు పేర్లను మార్చడం ఇదే తొలిసారి కాదు. అంతకుముందు 2015లో గూగుల్ ను ఆల్ఫాబెట్ కిందకు తీసుకొస్తూ సంస్థ పునర్వ్యవస్థీకరించింది. అప్పటిదాకా కేవలం సెర్చ్ ఇంజన్ గానే పేరుపడిపోయిన గూగుల్ ను.. డ్రైవర్ లెస్ కార్లు, హెల్త్ టెక్ కంపెనీగా ఎదిగింది. 2016లో స్నాప్ ఐఎన్ సీగా స్నాప్ చాట్ మారింది. అదే ఏడాది తొలి కళ్లద్దాలు, కెమెరా అద్దాలను లాంచ్ చేసిన ఆ సంస్థ.. కెమెరా కంపెనీగా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే ఫేస్ బుక్ లాంచ్ చేయబోతున్న కొత్త వ్యాపారాలేంటన్న దానిపై ఆసక్తి నెలకొంది.

Tags: BusinessFacebook CEO Mark ZuckerbergFacebook Chief Executive OfficerMark Zuckerbergsocial media
Share198Tweet124Share50

Related Posts

హార్దిక్ కు ముంబై జట్టు బాయ్ బాయ్..!

హార్దిక్ కు ముంబై జట్టు బాయ్ బాయ్..!

October 29, 2021
భజ్జీ, పాక్ ఫాస్ట్ బౌలర్ ఆమిర్ మధ్య ట్విట్టర్ వార్…

భజ్జీ, పాక్ ఫాస్ట్ బౌలర్ ఆమిర్ మధ్య ట్విట్టర్ వార్…

October 27, 2021
డేరా బాబాకు జీవిత ఖైదు శిక్ష…

డేరా బాబాకు జీవిత ఖైదు శిక్ష…

October 18, 2021
ఆ రోజు మాత్రం సోషల్ మీడియా నుంచి అదృశ్యమవుతున్నా: సానియా మీర్జా

ఆ రోజు మాత్రం సోషల్ మీడియా నుంచి అదృశ్యమవుతున్నా: సానియా మీర్జా

October 18, 2021
ఇండియాలో తొలి లిక్కర్‌ మ్యూజియం… ఎక్కడంటే?

ఇండియాలో తొలి లిక్కర్‌ మ్యూజియం… ఎక్కడంటే?

October 18, 2021
నవరాత్రుల సందర్భంగా విజయవాడలో హెలీ రైడ్స్…

నవరాత్రుల సందర్భంగా విజయవాడలో హెలీ రైడ్స్…

October 9, 2021
  • Trending
  • Comments
  • Latest
సోషల్ మీడియాలో రష్మిక రచ్చ…టాటూ అర్థం చెప్పేసిన హీరోయిన్…

సోషల్ మీడియాలో రష్మిక రచ్చ…టాటూ అర్థం చెప్పేసిన హీరోయిన్…

April 28, 2021

కిరణ్ దివి, తెలుగు రాష్ట్రాలలో అతి పిన్న వయస్కుడైన బిలియనీర్

January 18, 2021
దర్శకేంద్రుడి ‘పెళ్లిసందD’ ఫస్ట్ సాంగ్ రిలీజ్…

దర్శకేంద్రుడి ‘పెళ్లిసందD’ ఫస్ట్ సాంగ్ రిలీజ్…

April 28, 2021

పూరి-విజయ్ సినిమాకు విచిత్రమైన మూవీ టైటిల్ !

0

జెర్సీ సినిమా హిందీ రీమేక్ రిలీజ్ డేట్ ఖరారు !

0

ఈ ఏడాది భారత్‌-పాక్‌ సరిహద్దులో గణతంత్ర వేడుకలు రద్దు!

0
పుష్పక విమానం ట్రైలర్‌ రిలీజ్ చేసిన అల్లు అర్జున్‌…

పుష్పక విమానం ట్రైలర్‌ రిలీజ్ చేసిన అల్లు అర్జున్‌…

October 30, 2021
పునీత్‌కి నివాళులర్పించిన చిరు, వెంకటేశ్‌,అలీ…

పునీత్‌కి నివాళులర్పించిన చిరు, వెంకటేశ్‌,అలీ…

October 30, 2021
స్పీడ్ పెంచిన మాస్ మహారాజ… 70వ సినిమాకి ముహూర్తం ఖరారు!

స్పీడ్ పెంచిన మాస్ మహారాజ… 70వ సినిమాకి ముహూర్తం ఖరారు!

October 30, 2021
Telugu News – Telugu Times Now

Telugu Times Now is a one stop News and Media website for the people of Telugu states and Telugu diaspora, covering wide range of categories ranging from News to Entertainment and Astrology to Travel blogging.

Follow Us

Browse by Categories

  • Uncategorized
  • పీపుల్
  • రాజకీయ వార్తలు
  • వార్తలు
  • సినిమా వార్తలు

Recent News

పుష్పక విమానం ట్రైలర్‌ రిలీజ్ చేసిన అల్లు అర్జున్‌…

పుష్పక విమానం ట్రైలర్‌ రిలీజ్ చేసిన అల్లు అర్జున్‌…

October 30, 2021
పునీత్‌కి నివాళులర్పించిన చిరు, వెంకటేశ్‌,అలీ…

పునీత్‌కి నివాళులర్పించిన చిరు, వెంకటేశ్‌,అలీ…

October 30, 2021
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

Copyright © 2021 Telugu Times Now.

No Result
View All Result
  • సినిమా వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వార్తలు
  • పీపుల్

Copyright © 2021 Telugu Times Now.