దేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. సాధారణ ప్రజలతో పాటు అధికారులు ప్రజాప్రతినిధులు మరియు సెలబ్రెటీలు సైతం కరోనా బారిన పడ్డారు. ఇటీవలే బాలీవుడ్ నటి అలియా భట్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. కరోనా పాజిటివ్ రావడంతో అలియా హోమ్ ఐసోలేషన్ లో చికిత్స తీసుకుని కరోనా నుండి కోలుకుంది. కాగా తాజాగా బాలీవుడ్ నటి దీపికా పదుకునే కు సైతం కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే ఇప్పటి వరకు దీపికా తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు సోషల్ మీడియాలో పోస్ట్ చేయకపోయినా విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం నటి కరోనా బారిన పడినట్టు తెలుస్తోంది. కరోనా రావడం తో ప్రస్తుతం దీపికా హోమ్ ఐసోలేషన్ లో చికిత్స పొందుతోంది. దీపికా తన కుటుంబం తో కలిసి బెంగుళూరు లో ఉన్నట్టు సమాచారం.
ఇదిలా ఉండగా నిన్న దీపికా పదుకునే తండ్రి , ప్రముఖ బ్యాట్మింటన్ క్రీడాకారుడు ప్రకాష్ పడుకునే సైతం కరోనా తో ఆస్పత్రిలో చేరారు. అంతే కాకుండా దీపికా తల్లి , ఆమె చెల్లెలు అనిషా కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దాంతో వాళ్ళు ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటున్నారు.
#DeepikaPadukone has tested positive for Covid-19.
Get well soon, Deepika!#IIFA #Bollywood pic.twitter.com/RnD635WrKY
— IIFA (@IIFA) May 4, 2021