‘మా’ ఎన్నికల ప్రచారం వాడీవేడీగా సాగుతోంది. ఈ ఎన్నికల్లో నటుడు బాలకృష్ణ తనకే మద్దతు ఇస్తున్నారని అధ్యక్ష అభ్యర్థి మంచు విష్ణు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఉదయం ‘అఖండ’ సెట్‌కు వెళ్లిన విష్ణు కాసేపు బాలయ్యతో ముచ్చటించారు. తన మేనిఫెస్టో గురించి వివరించారు.
‘మా’ అభివృద్ధి, సభ్యుల సంక్షేమం కోసం తాను చేపట్టనున్న కార్యక్రమాలపై ఆయనతో చర్చించారు. తన అభిప్రాయాలతో ఏకీభవించిన బాలయ్య తనకు మద్దతు ప్రకటించారని విష్ణు తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా ఓ ట్వీట్ పెట్టారు. ‘బాలా అన్న.. మీ సపోర్ట్‌కు ధన్యవాదాలు. మీరు నాకు మద్దతు తెలపడం ఎంతో గర్వంగా ఉంది’ అని విష్ణు పోస్టు పెట్టారు. ఇటీవల తన తండ్రి మోహన్ బాబుతో కలిసి సూపర్ స్టార్ కృష్ణ మద్దతు కోరారు.
Thank you the one and only NataSimham, Bala Anna for you blessings and support for me during these MAA elections. It is my honor to have your backing. ❤️ pic.twitter.com/xvYwBw8ZSz
— Vishnu Manchu (@iVishnuManchu) October 3, 2021