దర్శకధీరుడు రాజమౌళి సినిమాలకు పంపిణీదారుల నుంచి ఎల్లప్పడూ ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఆయన సినిమాలు నిర్మాణ దశలో ఉన్నప్పుడే శాటిలైట్, డిజిటల్, రీమేక్ హక్కులకు పోటీ నెలకొంటుంది. రాజమౌళి తాజా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’విషయంలో ఇదే జరిగింది. ఈ మూవీ శాటిలైట్, డిజిటల్ హాక్కుల కోసం పలు సంస్థలు పోటీ పడ్డాయి. ముఖ్యంగా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం పలు ఓటీటీ సంస్థలు పోటీ పడగా.. చివరగా జీ5, నెట్ఫ్లిక్స్ ఆ హక్కులను సొంతం చేసుకున్నాయి. ఈ విషయాన్ని పెన్ స్టుడియోస్ అధికారికంగా ప్రకటించింది.
తెలుగు,తమిళ్, మలయాళం, కన్నడ ఓటీటీ హక్కులను జీ5 సొంతం చేసుకోగా, హిందీ, విదేశీ భాషల స్ట్రీమింగ్ హక్కులను నెట్ఫ్లిక్స్ చేజిక్కించుకుంది. ఇక శాటిలైట్ హక్కులను కూడా ఒక్కో భాషలో ఒక్కో చానెల్ సొంతం చేసుకుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ హక్కులను స్టార్ ఇండియా నెట్వర్క్ సొంతం చేసుకుంది. ఇక హిందీ హక్కులను జీ నెట్వర్క్ చేజిక్కించుకుంది. ఆర్ఆర్ఆర్ యూనిట్ నుంచి ఇప్పటికే ఈ హక్కులన్నింటినీ పెన్ స్టుడియోస్ దక్కించుకోగా.. ఆ సంస్థ నుంచి ఇవన్నీ ఆ హక్కుల్ని సంపాదించుకున్నాయి. నార్త్ థియేట్రికల్ రైట్స్ మాత్రం పెన్ స్టుడియోస్ వద్దే ఉన్నాయి.
BIGGG NEWS… #PEN Studios announces #India's biggest *post theatrical* DIGITAL and SATELLITE deal for the most-awaited film #RRR… Directed by #SSRajamouli… Check out the video…#JrNTR #RamCharan, #AjayDevgn #AliaBhatt #JayantilalGada #DVVMovies pic.twitter.com/tEd7o8jrjm
— taran adarsh (@taran_adarsh) May 26, 2021