అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో ‘పుష్ప’ సినిమా రూపొందుతోంది. చిత్రీకరణపరంగా ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంది. అడవి నేపథ్యంలో .. ఎర్రచందనం అక్రమ రవాణా చుట్టూ ఈ కథ తిరుగుతుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్టు సింగిల్ కొత్త రికార్డులను నమోదు చేస్తోంది.
రష్మిక కథానాయికగా నటించిన ఈ సినిమాలో, ప్రతినాయకుడిగా మలయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్ నటిస్తున్నాడు. ఇటీవలే ఆయన ఈ సినిమా షూటింగులో జాయిన్ అయ్యాడు. తాజాగా ఆయన ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఆయన ఐపీఎస్ భన్వర్ సింగ్ షెకావత్ గా కనిపించనున్నాడనే విషయం ఈ పోస్టర్ ద్వారా తెలుస్తోంది.
ఈ పాత్రలో ఫాహద్ ఫాజిల్ నున్నటి గుండుతో కొత్త లుక్ తో కనిపిస్తున్నాడు. ఈ లుక్ ను చూస్తుంటేనే ఆయన పాత్రను చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశారనే విషయం అర్థమవుతోంది. ఆయన పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. క్రిస్మస్ కి ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
Meet the #VillainOfPushpa 🔥
The most talented #FahadhFaasil turns into menacing BHANWAR SINGH SHEKHAWAT (IPS) to lock horns with our #PushpaRaj 👊#PushpaTheRise #ThaggedheLe 🤙@alluarjun @iamRashmika @Dhananjayaka @aryasukku @ThisIsDSP @resulp @adityamusic @PushpaMovie pic.twitter.com/tskyU5cZ8a
— Mythri Movie Makers (@MythriOfficial) August 28, 2021