టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ, వరల్డ్ ఫేమస్ లవర్ లాంటీ డిజాస్టర్ సినిమా తర్వాత స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్లో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రానికి ‘లైగర్’ అనే టైటిల్ ఖరారు చేస్తున్నట్లు ఈరోజు ప్రకటించారు. తెలుగు హిందీ భాషాల్లో మాత్రమే కాకుండా ఇండియాలోని ప్రధాన భాషాల్లో ఈ సినిమా విడుదలకానుంది. ఈ చిత్రంలో విజయ్‌కు జోడిగా బాలీవుడ్ నటి అనన్య పాండే నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ముంబైతో పాటు విదేశాల్లో కూడా జరుగుతోంది.
ఇదిలా ఉండగా పోస్టర్ రిలీజ్ కాగానే, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కొందరు అప్పుడే కటౌట్లు తయారుచేసి భాగ్యనగరంలో నానా హడావిడి చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో విజయ్ ఫ్యాన్స్ తమ హీరో కటౌట్ మీద మందు చల్లుతూ సెలబ్రేట్ చేసుకుంటూ కనిపించారు.