పవన్ కళ్యాణ్ అభిమానులు ఎన్నో రోజుల నుంచి వేచి చూస్తున్న సమయం రానే వచ్చింది. ఈయన సినిమా ట్రైలర్ విడుదలైంది. పవన్ సినిమా కోసం అభిమానులు ఎలా వేచి చూస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే సినిమాకు సంబంధించిన ప్రతీ అప్ డేట్ వాళ్లు పండగ చేసుకుంటారు. ఇప్పుడు ట్రైలర్ కూడా 24 గంటల ముందు నుంచి సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నారు. అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ కూడా వకీల్ సాబ్ కోసం చూస్తున్నారు. ఏప్రిల్ 9న విడుదల కానుంది ఈ చిత్రం. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేస్తే.. ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత రచ్చ డబుల్ అయిపోయింది. వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న వకీల్ సాబ్ సినిమాలో స్టైలిష్ అవతారంలో కనిపిస్తున్నాడు పవర్ స్టార్. సినిమాకు మరో 10 రోజులు మాత్రమే టైమ్ ఉండటంతో ప్రమోషన్ కూడా జోరు పెంచేసారు దర్శక నిర్మాతలు. తాజాగా ట్రైలర్‌తో ప్రమోషన్ మరింత పీక్స్‌కు చేరిపోయింది. పింక్ సినిమా రీమేక్‌గా దీన్ని తెరకెక్కిస్తున్నాడు వేణు శ్రీరామ్. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఒరిజినల్లో లేని చాలా అంశాలను ఇందులో పొందుపరిచాడు దర్శకుడు. పవన్ మూడేళ్ల తర్వాత నటిస్తున్న సినిమా కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.
ఏకంగా 120 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుంది. ఈ సినిమా కోసం పవన్ అభిమానులు కళ్ళు కాయలు కాచేలా చూస్తున్నారు. ఈయన డబ్బింగ్ కూడా పూర్తి చేసాడు. హిందీ, తమిళంలో పింక్ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తమిళనాట అజిత్ నెర్కొండ పార్వై పేరుతో రీమేక్ చేస్తే అక్కడా విజయం సాధించింది. ఇప్పుడు తెలుగులోకి వస్తుంది పింక్. ఈ సినిమాలో పవన్ ఫ్యాన్స్ కోసం రెండు హైలైట్ అంశాలను దాచేసారు దర్శక నిర్మాతలు. వాటిని ఇప్పటి వరకు బయట చెప్పలేదు. తాజాగా విడుదలైన ట్రైలర్లో యాక్షన్ ఎపిసోడ్స్ బాగానే హైలైట్ చేసారు. థియేటర్లో అవి మరింత అదిరిపోతాయని చెప్తున్నారు దర్శక నిర్మాతలు.
పింక్, నెర్కొండ పార్వై సినిమాల్లో లేని రెండు భారీ యాక్షన్ సీక్వెన్సులు వకీల్ సాబ్‌లో ఉన్నాయి. ఒరిజినల్లో లేని సన్నివేశాలను కూడా పవన్ ఇమేజ్ కోసం ఇక్కడ యాడ్ చేసారు. పింక్ స్క్రిప్టులో వేణు శ్రీరామ్ భారీగానే మార్పులు చేసాడు. తెలుగు ప్రేక్షకుల కోసం రెండేళ్లు కష్టపడ్డాడు. ఎప్రిల్ 9న వకీల్ సాబ్ చూసిన తర్వాత అభిమానులు తన కష్టాన్ని గుర్తిస్తారని నమ్మకంగా చెప్తున్నాడు శ్రీరామ్ వేణు. ఆ రెండు యాక్షన్ సీక్వెన్సులు కూడా సినిమాకు హైలైట్ అవుతాయని చిత్రయూనిట్ బలంగా నమ్ముతుంది.