ఈ సినిమా నుంచి రేపు ఉదయం 9:45 నిమిషాలకు పవర్ ప్యాక్డ్ ఎనౌన్స్ మెంట్ ఒకటి ఉంటుందని తాజాగా ఒక ప్రకటన ఇచ్చారు. మరి రేపటి ఎనౌన్స్ మెంట్ ద్వారా ఏయే విషయాలపై క్లారిటీ ఇవ్వనున్నారో చూడాలి. ఈ సినిమాకి ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.
మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో, పవన్ జోడీగా పూజ హెగ్డే అలరించనుందనే టాక్ వినిపిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకి, ఆనంద్ సాయి ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. వచ్చేనెల నుంచి ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనున్నట్టు చెప్పుకుంటున్నారు.