హీరోయిన్ తమన్నా ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు వెబ్ సిరీస్‌లు కూడా చేస్తోంది. అందులో భాగంగా ఆమె తాజాగా మరో వెబ్ సిరీస్‌లో నటించింది. ఈ తాజా వెబ్ సీరీస్ పేరు ‘నవంబర్ స్టోరీ’. తమిళ దర్శకుడు ఇంద్ర సుబ్రమణియన్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సీరీస్ ఈ నెల 20 నుంచి డిస్ని ప్లస్ హాట్ స్టార్ వీఐపీలో ప్రసారం కానుంది. ఈ వెబ్ సిరీస్ తెలుగు, తమిళ భాషాలతో పాటు హిందీలో కూడా స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్‌లో తమన్నా అనురాధ అనే అమ్మాయి పాత్రలో నటించిందట. ఈ పాత్ర తనకెంతో సంతృప్తిని ఇచ్చిందని ఈ సందర్భంగా పేర్కోంది తమన్నా. ఇక ఆమె నటించిన మరో వెబ్ సిరీస్ ‘లెవన్త్ అవర్’. ఈ వెబ్ సిరీస్ ఇటీవల ఆహాలో ప్రసారం అయ్యి పరవాలేదనిపించింది. ఈ వెబ్ సిరీస్‌కు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించారు. ప్రవీణ్ సత్తారు గతంలో రాజశేఖర్ హీరోగా వచ్చిన గరుడ వేగ అనే సైంటిఫిక్ థ్రిల్లర్‌ను తెరకెక్కంచి మంచి విజయాన్ని అందుకున్నారు. ఆయన ప్రస్తుతం నాగార్జున హీరోగా కాజల్ హీరోయిన్గా ఓ థ్రిల్లర్‌ను తెరకెక్కిస్తున్నారు.
ఇక తమన్నా నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. తమన్నా ప్రస్తుతం గోపీచంద్ హీరోగా వస్తోన్న సీటీమార్ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే కరోనా కారణంగా ఈ సినిమా విడుదలను వాయిదా వేసింది చిత్రబృందం. ఈ సినిమా కబడ్డీ ఆట నేపథ్యంలో తెరకెక్కుతోంది. గోపీచంద్ ఏపీకి కోచ్‌గా ఉంటే.. తమన్నా తెలంగాణ కోచ్‌గా కనిపించనుందట. ఈ సినిమాలో తమన్న సొంతంగా డబ్బింగ్ చెప్పిందట. అంతేకాదు ఈ సినిమాలో తమన్నా తన పాత్రకు డబ్బింగ్ చెప్పడమే కాదు.. తెలంగాణ యాసలో అదరగొట్టిందట. ఈ సినిమాను శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తుండగా.. సంపత్ నంది దర్శకత్వం వహించారు.
ఇక ఈ సినిమాతో పాటు తమన్నా నితిన్ అంధాదున్ తెలుగు రీమేక్‌లో నటిస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. హిందీలో టబు చేసిన పాత్రలో తమన్నా కనిపించనుంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నాడు. నితిన్ సరసన హీరోయిన్గా కన్నడ భామ నభా నటేష్ చేస్తోంది. ఈ సినిమాతో పాటు తమన్నా.. వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ F2కు సీక్వెల్‌గా వస్తోన్న F3లో నటిస్తోంది. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా.. దిల్ రాజు నిర్మిస్తున్నారు. దీంతో పాటు తమన్నా యువ హీరో సత్యదేవ్‌తో కలిసి ‘గుర్తుందా శీతాకాలం’ సినిమాలో నటిస్తోంది. కన్నడ హిట్ మూవీ ‘లవ్ మాక్‌టైల్’కు రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.
Presenting Hotstar Specials November Story.
All episodes streaming from 20th May in Tamil, Telugu and Hindi. @DisneyplusHSVIP https://t.co/J7mLoI1MBt#HotstarSpecials #NovemberStory #Pasupathy @gmkhighness #Aruldass @actorvivekpra pic.twitter.com/e5wHSsCrYx— Tamannaah Bhatia (@tamannaahspeaks) May 6, 2021