అక్కినేని సమంత లీడ్ రోల్ పోషిస్తున్న కొత్త సినిమా ‘శాకుంతలం’. కెరీర్లో మొదటిసారి పౌరాణిక పాత్ర పోషిస్తోంది సమంత. గుణశేఖర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ కేటాయించి పాన్ ఇండియా సినిమాగా ఈసినిమా నిర్మిస్తున్నారు. నేడు (సోమవారం) హైదరాబాద్‌లో శాకుంతలం సినిమా కోసం వేసిన భారీ సెట్స్‌లో పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను ఘనంగా ప్రారంభించారు. వచ్చే వారం నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.