ట్విట్టర్లో ఆమెకు 8.9 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో తన పేరును సమంత రుత్ప్రభు, ఫేస్బుక్లో సమంత అక్కినేనిగానే ఉంచుకున్న సదరు హీరోయిన్ ట్విట్టర్లో ఒక్కసారిగా తన పేరును మార్చేయడం పట్ల నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఇంతకు ముందు వరకు ట్విట్టర్లో ఆమె ఇంటి పేరు సమంత అక్కినేనిగా ఉండేది.. ఇప్పుడు మాత్రం కేవలం ఎస్ అనే అక్షరాన్నే ఉంచుకుని మిగతాదంతా తీసేసింది. దీంతో ఎందుకు అలా చేశావు సమంత? అంటూ ప్రశ్నిస్తున్నారు. కొందరు సమంతకు ఆమె భర్త నాగ చైతన్యతో గొడవలు వచ్చాయా? అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.
పెళ్లి జరిగాక కూడా సమంత సినిమాల్లో నటిస్తోన్న విషయం తెలిసిందే. సామాజిక మాధ్యమాల్లో తన ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ ప్రతిరోజు అభిమానులను అలరిస్తోంది. ప్రస్తుతం ఆమె ‘శాకుంతలం’ సినిమాలో నటిస్తోంది.