ఇక సమంత నటించిన ‘శాకుంతలం’ సినిమా షూటింగ్ ఇటీవలే ముగిసింది. ప్రస్తుతం తమిళ చిత్రం ‘కాత్తు వకుల రెండు కాదల్’ షూటింగ్ లో బిజీగా ఉంది. మరోవైపు ఒక తాజా ఇంటర్వ్యూలో ఆమె సంచలన ప్రకటన చేసింది. కొంత కాలం పాటు నటనకు బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నానని ఆమె ప్రకటించింది. కొంత కాలంగా కొత్త సినిమాలకు ఆమె సైన్ చేయడం లేదు. వచ్చే ఏడాదే ఆమె మళ్లీ నటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ వార్తలు సమంత అభిమానులను షాక్ కు గురి చేశాయి.
మరోవైపు ‘ఫ్యామిలీ మెన్ 2’ వెబ్ సిరీస్ లో ఆమె పోషించిన రాజి పాత్రపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఆమె స్పందిస్తూ… ఎవరినైనా తాను బాధపెట్టి ఉంటే క్షమించాలని కోరింది.