రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రూపొందుతున్న పీరియాడికల్ చిత్రం ఆర్ఆర్ఆర్. భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్ర రిలీజ్ కోసం అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు. పలు మార్లు వాయిదా పడ్డ ఈ చిత్రం అక్టోబర్ 13న దసరా శుభాకాంక్షలతో విడుదల అవుతుందని అందరు భావించారు. కాని మరలా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్.
పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అక్టోబర్ 21కి పూర్తి అవుతుందని , అందరు భావిస్తున్నట్టే మా చిత్రాన్ని వాయిదా వేస్తున్నామని, రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించలేకపోతున్నారు.అందుకు కారణం థియేటర్స్ నిరవధికంగా మూసివేయటమే అని చెప్పారు.ప్రపంచ సినిమా మార్కెట్ చక్కబడిన తర్వాత వీలయినంత త్వరగా విడుదల తేదీని ప్రకటిస్తామంటున్నారు.
ఆ మధ్య సంక్రాంతికి విడుదల అవుతుంది అన్నారు. లేదంటే ఉగాదికి అన్నారు. అయితే పరిస్థితులు చక్కబడ్డ తర్వాతే ఆర్ఆర్ఆర్ మూవీపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇందులో అలియా భట్, సముద్ర ఖని, అజయ దేవగణ్ పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు
Post production nearly done to have #RRRMovie ready by October’21.
But as known to many, we are postponing the release but cannot announce a new date with theatres indefinitely closed.
We will release at the earliest possible date when the world cinema markets are up and running.— RRR Movie (@RRRMovie) September 11, 2021