మాస్ మహారాజ్ రవితేజ మరియు శృతి హాసన్ నటించిన క్రాక్, కొత్త ఏడాది అద్భుతమైన ఆరంభం ఇచ్చింది. బాక్సాఫీస్ వద్ద మొదటి వారం రన్ ని విజయవంతంగా పూర్తి చేసింది. మాస్టర్ – రెడ్ – అల్లుడు అదుర్స్ వంటి క్రేజీ చిత్రాలతో పోటీపడుతూ ఈ చిత్రం సంక్రాంతి విజేతగా అవతరించింది.
ఈ చిత్రం మొదటి వారంలో అంచనాలకు మించిన కలెక్షన్లను సాధించింది. ఏ మాత్రం శ్రమ లేకుండా బ్రేక్ ఈవెన్ మార్కుకు చేరుకుంది. మొదటి వారంలో క్రాక్ 36 కోట్ల వసూళ్లు సాధించింది. బాక్సాఫీస్ వద్ద 23 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఈ కలెక్షన్లు రవితేజ కెరీర్లోనే బెస్ట్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ గా నిలిచాయి.
కేవలం 50 శాతం ఆక్యుపెన్సీ తో ఇంతటి భారీ ఆదాయం ఆర్జించడం క్రాక్ కు గొప్ప విషయం అనే చెప్పాలి. ఈ చిత్రానికి నైజాం ప్రాంతంలో 7.22 కోట్ల వసూళ్లు దక్కగా, ఉత్తరాంధ్ర లో 2.56 కోట్లు వసూలు చేసింది. ఆంధ్రలోని మిగిలిన ప్రాంతాలలో 8 కోట్ల వరకు వసూలైంది. రాయలసీమ ప్రాంతంలో సుమారు 3.9 కోట్లు వచ్చాయి. మొత్తంగా ఈ చిత్రం కేవలం తెలుగు రాష్ట్రాలలో కలిపి 22-23 కోట్లు దాకా వసూలు చేసింది.
మిగతా అన్ని ప్రాంతాల కలెక్షన్స్ 2 కోట్ల వరకు ఉన్నాయి. వసూళ్ల స్థిరత్వం కొనసాగితే.. ఈ చిత్రం త్వరలో 30 కోట్ల మార్కును చేరుకుంటుంది. క్రాక్ థియేట్రికల్ హక్కులు 17 కోట్లకు అమ్ముడయ్యాయి.