సొట్ట బుగ్గల సుందరి తాప్సీ కెరీర్లో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ముందుకు సాగుతుంది. త్వరలో రష్మీ రాకెట్ అనే బాలీవుడ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుండగా, తాజాగా చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. ఇందులో తాప్సీ అథ్లెట్‌గా అదరగొట్టింది. సమాజం ముందు దోషిగా నిలబడిన రష్మీ హ్యుమన్ రైట్స్‌ని ఆశ్రయించి ఎలాంటి పోరాటాన్ని చేసింది.. తిరిగి ఎలా తన కలని నిజం చేసుకుంది.. అనేది ఈ సినిమాలో చూపించబోతున్నారని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది.
గ్రామీణ స్థాయి నుంచి వెళ్లి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం కోసం అవమానాలు ఎదుర్కొన్న కొంత మంది అథ్లెట్ల జీవితాలని స్ఫూర్తిగా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు ఆకర్ష్ ఖురానా. లేడీ అథ్లెట్ తన లక్ష్యం చేరడం కోసం ఎలాంటి అవాంతరాల్ని ఎదుర్కొందనేది ఆసక్తికరంగా చూపించనున్నట్టు అర్ధమవుతుంది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో తాప్సీ గుజరాత్ అథ్లెట్ రష్మీ పాత్రలో కనిపించనున్నారు.రోనీ స్ర్కూవాలా, నేహా, ప్రంజల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. క్రీడా నేపథ్యం ఉన్న చిత్రం కావడంతో ఫిట్నెస్ విషయం తాప్సీ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు.
‘తప్పడ్’, ‘హసీనా దిల్రుబా’, ‘అనబెల్ సేతుపతి’.. ఇలా వరుస సినిమాలతో సందడి చేయనుంది తాప్సీ. తమిళ్ లో విజయ్ సేతుపతితో కలిసి అనేబెల్లా సేతుపతి సినిమాలో చేసింది ఈ సొట్టబుగ్గల సిందరి.ఈ మూవీలో తాప్సీ లుక్ ఆకట్టుకునే విధంగా ఉంటుంది.