టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్స్‌లో రామ్ చరణ్- ఉపాసన జంట ఒకటి. 2012 జూన్14న వివాహం చేసుకున్న వీరు నేటితో తొమ్మిదేళ్ల వైవాహిక జీవితాన్ని పూర్తి చేసుకున్నారు. ఐదేళ్ల ప్రేమ తర్వాత ఉపాసనకి మెగా కోడలి ప్రమోషన్ ఇచ్చారు చరణ్. అయితే ఈ రోజు వారిది 9వ వివాహ వార్షికోత్సవ వేడుక కాగా పలువురు ప్రముఖులు, సన్నిహితులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
యంగ్ ఎంటర్‌ప్రెన్యూయర్‌గా సత్తా చాటుతూ అపోలో లైఫ్ విభాగం వైస్ ఛైర్మన్‌గా కొనసాగుతున్న ఉపాసన తన సోషల్ మీడియా ద్వారా రామ్ చరణ్‌తో దిగిన ఫొటోని షేర్ చేస్తూ.. తన భర్తకి చీర్స్ చెబుతూ మెగా అభిమానులకు కిక్కిచ్చే పోస్ట్ పెట్టింది. ఈ రిలేషన్‌షిప్‌ని ఇంత బలంగా, ప్రకాశవంతంగా ఉంచుకున్నందుకు మన ఇద్దరికీ చీర్స్ అంటూ ఉపాసన కామెంట్ చేసింది. చాలా సందర్భాల్లో ఉపాసన, రామ్ చరణ్ ఇద్దరూ కూడా ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ, గౌరవం తెలియపరచుకున్న విషయం తెలిసిందే.
🥂 to us for keeping it
real, robust & radiant 😉😍 pic.twitter.com/ZLrMIEIQJ3— Upasana Konidela (@upasanakonidela) June 14, 2021