బాలీవుడ్లో ఘన విజయం సాధించిన పింక్ మూవీ ఆధారంగా తెరకెక్కిన వకీల్ సాబ్ చిత్రం విడుదలకు ముస్తాబుతున్నది. ఇప్పటికే ప్రచార జోరును సాగిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తనకు సంబంధించిన వర్క్‌ను పూర్తి చేసేందుకు సిద్ధమయ్యారు. పవన్ కల్యాణ్ డబ్బింగ్ చెబుతున్న దృశ్యాలు మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సినిమాకు సంబంధించిన వివరాల్లోకి వెళితే…
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన పింక్ చిత్రం తమిళ భాషలో కూడా మంచి విజయాలను అందుకొన్నది. తాజాగా తెలుగులో బోని కపూర్, దిల్ రాజు నిర్మాతగా వకీల్ సాబ్ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది.
వాస్తవానికి వకీల్ సాబ్ చిత్రం గత ఏడాది ఏప్రిల్‌లో రిలీజ్ చేయాలని భావించారు. లాక్డౌన్ కారణంగా సినిమా కొంత షూటింగ్ వాయిదా పడటం, మరికొంతగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆగిపోవడంతో సినిమా రిలీజ్ మరింత వాయిదా పడింది.
ఇదిలా ఉండగా, పవన్ కల్యాణ్ తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్‌ను చెప్పేందుకు హైదరాబాద్‌లోని ప్రముఖ థియేటర్లో వచ్చారు. ఆయన డబ్బింగ్ చెబుతున్న ఫోటోలు మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. డబ్బింగ్ చెబుతున్నప్పుడు పవన్ చాలా భావోద్వేగంగా కనిపించారు. తెల్లటి దుస్తుల్లో పవన్ కల్యాణ్ ఆకట్టుకొనే విధంగా కనిపించారు.
వకీల్ సాబ్ డబ్బింగ్ పనులు పూర్తయిన తర్వాత పవన్ కల్యాణ్ చిత్ర యూనిట్‌తో పవన్ కల్యాణ్ ఫోటోలు దిగారు. సాంకేతిక నిపుణులతో చాలా సన్నిహితంగా మాట్లాడుతూ వారిని ఆకట్టుకొన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనుల గురించి పవన్ కల్యాణ్ అడిగి తెలుసుకొన్నట్టు యూనిట్ వర్గాలు వెల్లడించాయి.