అఖిల్ .. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ కాంబినేషన్లో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ రూపొంది కొంతకాలమవుతోంది. కరోనా కారణంగా ఈ సినిమా విడుదల విషయంలో జాప్యం జరుగుతూ వచ్చింది. ఇక దసరా రోజుల్లో మాత్రం ఈ సినిమా థియేటర్లకు వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతూ వచ్చింది.
తాజా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు. అక్టోబర్ 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్ ను విడుదల చేశారు. ఇక నుంచి ఈ సినిమా ప్రమోషన్లు జోరందుకుంటాయని చెప్పుకొచ్చారు. పూజ హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమాకి, గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చాడు. ఆయన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమా నిర్మితమైంది.
#MostEligibleBachelor is 𝐌𝐚𝐫𝐜𝐡𝐢𝐧𝐠 𝐓𝐨𝐰𝐚𝐫𝐝𝐬 𝐎𝐜𝐭 𝟖𝐭𝐡. 😎💫
Exciting updates, promotions to start rolling soon. #MEBOnOct8th 🧡#AlluAravind @hegdepooja @baskifilmz @GopiSundarOffl #PradeeshMVarma #BunnyVas #VasuVarma @adityamusic @GA2Official pic.twitter.com/Tg1VYW5vnM
— Akhil Akkineni (@AkhilAkkineni8) September 7, 2021