దక్షిణాది బుట్టబొమ్మ పూజ హెగ్డే ముంబయిలో సెటిలవుతున్నట్టు తెలుస్తోంది. ఈ కన్నడ భామ ముంబయిలో సొంత ఇల్లు నిర్మించుకుంటోంది. సొంత ఇల్లు కలిగివుండడం అనేది తన కల అని, ఇప్పుడది నెరవేరుతోందని పూజ ఇన్ స్టాగ్రామ్ లో వెల్లడించింది. తన ఇంటి పనులకు సంబంధించిన పిక్ ను కూడా పంచుకుంది. అందులో పూజ తల్లిని కూడా చూడొచ్చు.
“నా కలలను నిర్మించుకుంటున్నాను” అంటూ అమ్మడు క్యాప్షన్ కూడా పెట్టింది. కాగా, పూజ హెగ్డే సొంతింటి నిర్మాణ పనులను ఆమె తల్లి పర్యవేక్షిస్తోందట. ఈ సందర్భంగా పూజ తన తల్లిని ‘సూపర్ మామ్’ అంటూ అభివర్ణించింది.
Building my dreams ❤️ #home #supermom #mykindalovestory pic.twitter.com/7h4tb0MwZb
— Pooja Hegde (@hegdepooja) October 27, 2021