‘బాహుబలి’ సినిమాల తర్వాత దర్శకుడు రాజమౌళి రూపొందిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా యూనిట్ ఉగాది సందర్భంగా మరో కొత్త పోస్టర్ ను విడుదల చేసింది. ఈ సినిమాలో కొమరం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తోన్న విషయం తెలిసిందే. వారిద్దరిని జనాలు ఎత్తుకుని పైకి ఎగరేస్తూ సంబరాలు జరుపుకుంటున్నట్లు ఈ పోస్టర్ లో చూపించారు.
జనాలు తమను పైకి ఎగరేస్తుండగా ఇద్దరు హీరోలు చిరునవ్వులు చిందిస్తున్నారు. ప్రజలకు ఈ పోస్టర్‌తో ఆర్ఆర్ఆర్ టీమ్ ఉగాది శుభాకాంక్షలు తెలిపింది. ఈ సినిమా యూనిట్ ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు, టీజర్లు ప్రేక్షకులను అలరించాయి.
‘బాహుబలి’ వంటి భారీ హిట్ తర్వాత రాజమౌళి ఈ సినిమా తీస్తుండడంతో దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ను ఒక్కొక్కటిగా వదులుతూ రాజమౌళి ప్రేక్షకుల్లో అంచనాలను మరింత పెంచుతున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 13వ తేదీన ఈ సినిమా విడుదల కానున్నట్లు ఇప్పటికే ప్రకటన వచ్చింది. ఈ సినిమా దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోంది.
I wish everyone a happy and prosperous year ahead…😊
ఉగాది శుభాకాంక్షలు.#ಯುಗಾದಿ #GudiPadwa #नवसंवत्सर #தமிழ்ப்புத்தாண்டு #വിഷു #ਵੈਸਾਖੀ #RRRMovie @ssrajamouli @tarak9999 @ajaydevgn @aliaa08 @RRRMovie @DVVMovies @PenMovies @LycaProductions pic.twitter.com/jbZVyzWioZ
— Ram Charan (@AlwaysRamCharan) April 13, 2021
Here’s wishing you and your family a great year ahead 🤗@ssrajamouli @AlwaysRamCharan @ajaydevgn @aliaa08 @RRRMovie @DVVMovies @PenMovies @LycaProductions#ఉగాది #ಯುಗಾದಿ #GudiPadwa #नवसंवत्सर #தமிழ்ப்புத்தாண்டு #വിഷു #ਵੈਸਾਖੀ #RRRMovie pic.twitter.com/yKp1HO3qFr
— Jr NTR (@tarak9999) April 13, 2021