‘బాహుబలి: బిఫోర్ ది బిగెనింగ్’ పేరిట ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ కోసం భారీ వ్యయంతో ఈ సీరీస్ ను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. కాగా, ఇందులో కీలక పాత్రను ప్రముఖ కథానాయిక నయనతార పోషించనున్నట్టు తెలుస్తోంది. ఇదే వాస్తవమైతే, ఇది ఆమెకు తొలి వెబ్ సీరీస్ అవుతుంది. అయితే, ఆమె ఏ పాత్ర పోషిస్తుందనేది ఇంకా వెల్లడి కాలేదు. మరోపక్క శివగామి పాత్రలో బాలీవుడ్ నటి వామికా గాబీ నటించనుంది. ఇది మొత్తం తొమ్మిది ఎపిసోడ్లుగా రూపొందుతుంది.