ఏపీ టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి పేర్ని నాని. జూనియర్ ఎన్టీఆర్ భయం లోకేశ్ కు పట్టుకుందని ఎద్దేవా చేశారు. జూ. ఎన్టీఆర్ ఎక్కడ టీడీపీని హస్తగతం చేసుకుంటారోనన్న ఆందోళనలో లోకేశ్ ఉన్నారన్నారు. లోకేశ్ పెద్ద రాజకీయ నిరుద్యోగి అని ఎద్దేవా చేశారు.
2021, జూన్ 21వ తేదీ సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..సీఎం జగన్ పై నారా లోకేశ్ పై విచక్షణారహితంగా మాట్లాడుతున్నారని, ఇది కరెక్టు కాదన్నారు. జూనియర్ ఎన్టీఆర్ వస్తారని లోకేశ్ ప్రస్టేషన్ లో ఉన్నాడని, గడ్డం పెంచేస్తే గబ్బర్ సింగ్ కాలేడు..బూతులు మాట్లాడితే..సీఎం కాలేడన్నారు.
లోకేశ్ ను చూస్తుంటే జాలేస్తుందన్నారు. ఎన్టీఆర్ ను బాబు వెన్నుపోటు పొడిచినట్లే..జూ.ఎన్టీఆర్ పార్టీని లాక్కొంటారనే భయం ఉందన్నారు. మళ్లీ ఉద్యోగం ఎతుక్కోవాలనే దానిపై ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు.