ఫాహద్ ఫాజిల్ కథానాయకుడిగా తెరకెక్కిన మలయాళీ చిత్రం ‘మాలిక్’. మహేశ్ నారాయణ్ దర్శకుడు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. జులై 15 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్ర బృందం. యాక్షన్ సన్నివేశాలతో ఆద్యంతం ఉత్కంఠగా సాగింది ఈ ప్రచార చిత్రం. ఫాహద్ నటన ఆకట్టుకుంటోంది. ట్రైలర్‌ని బట్టి చూస్తుంటే సముద్ర తీరాన ఉండే గ్రామాలకు సంబంధించిన కథ అనిపిస్తుంది. ఆ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యల్ని తీర్చే వ్యక్తిగా ఫాహద్ పోరాటం చేస్తుంటారు. జోసెఫ్ నిర్మించిన ఈ క్రైమ్ డ్రామా కథకి సుశిన్ శ్యామ్ సంగీతం అందించారు.