వైవిధ్యమైన నటనకు కేరాఫ్ అడ్రస్ ఫహద్ ఫాజిల్. మలయాళ చిత్రాల్లో నటించే ఆయనకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. తాజాగా ‘ఇరుల్’అనే చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. మర్డర్ మిస్టరీ నేపధ్యంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నెట్ఫ్లిక్స్ వేదికగా ఏప్రిల్ 2 విడుదల చేయనున్నారు. కేవలం ముగ్గురి మధ్యే నడిచే ఈ కథలో మరో ప్రతిభగల నటుడు సౌబిన్ షాహిర్, దర్శన రాజేంద్రన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. నసీఫ్ యూసఫ్ ఇజుద్దీన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆద్యంతం ఉత్కంఠ రేపుతున్న ఆ ట్రైలర్ను మీరు చూసేయండి!