కంగనా రనౌత్ ఇప్పుడు `తలైవి`గా మారిపోయింది.తన బర్త్ డే రోజు(మంగళవారం) విడుదల చేసిన `తలైవి` ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంటోంది.మరోవైపు ఆమె బర్త్ డే ఫోటోలు చక్కర్లుకొడుతున్నాయి. పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో కంగనా బర్త్ డే జరిగింది.బర్త్ డే పార్టీ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
కంగనా రనౌత్ మంగళవారంతో 34ఏళ్లు పూర్తి చేసుకుంది.ఈ సందర్భంగా ఆమె నటించిన `తలైవి` చిత్ర ట్రైలర్‌ని విడుదల చేశారు.ఇందులో కంగనా `తలైవి` పాత్రలో ఒదిగిన తీరుకి ప్రశంసలు దక్కుతున్నాయి.
బర్త్ డేకి ఒక్క రోజు ముందు తనకి ఉత్తమ నటిగా జాతీయ అవార్డు రావడం, బర్త్ డే రోజు `తలైవి` ట్రైలర్ విడుదల చేయడంతో కంగనా ఉబ్బితబ్బిబ్బవుతుంది….
మంగళవారం బర్త్ డే పార్టీ ఇచ్చింది కంగనా. ఇందులో అనుపమ్ ఖేర్, రాణి ముఖర్జీ, శేఖర్ కపూర్,శేఖర్ కపూర్, ఏక్తా కపూర్, `తలైవి` నిర్మాత విష్ణు ఇందూరి పాల్గొని సందడి చేశారు….
ప్రస్తుతం ఈ బర్త్ డే పార్టీకి చెందిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తున్నాయి…
అయితే ఇందులో కంగనాకి ఆరు కేక్‌లతో బర్త్ డే చేయడం విశేషం.. ప్రముఖులు తలా ఓ కేక్‌ని తీసుకొచ్చినట్టు తెలుస్తుందివీరంతా వీరంతా బర్త్ డే చేసినట్టు సమాచారం….
వీరంతా కంగనా బర్త్డ్ డే పార్టీలో మునిగితేలారు.బాగా ఎంజాయ్ చేశారు. తాజాగా కంగనా పంచుకున్న ఫోటోలు చూస్తుంటే అర్థమవుతుంది.ముంబయిలో రాత్రి ఈ బర్త్ డే వేడుక జరిగింది….
చీరకట్టులో కంగనా లుక్స్ అదరిపోయేలా ఉంది….
ఇదిలా ఉంటే కంగనా తన ఇంటి వద్ద లేదు. దీంతో వారి పేరెంట్స్ కంగనా పేరుతో అర్చన చేయిస్తున్నారు. పూజా కార్యక్రమాలు నిర్వహించారు….