టాలీవుడ్ స్టార్ హీరో గోపీచంద్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం `సీటీమార్`. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తమన్న కథానాయికగా నటిస్తోంది. ఇందులో హిప్పీ సినిమా నటి దిగంగన సూర్యవంశీ మరో నాయిక. మరో కీలక పాత్రలో భూమిక నటిస్తోంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.
స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే ఈ సినిమా ఆద్యంతం రక్తి కట్టించే ఈ విధంగా ఉంటుందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. కబడ్డీ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో గోపీచంద్ ఆంధ్రా టీమ్ ఫీమేల్ కబడ్డీ టీం కోచ్ గా నటిస్తుండగా, తమన్నా తెలంగాణ ఫీమేల్ కబడ్డీ టీమ్ కోచ్ గా నటిస్తోంది. ఆ ఇద్దరి నడుమ నడిచే రొమాంటిక్ ట్రాక్ ఆసక్తికరంగా సాగుతుంది అని చెప్పుకుంటున్నారు. గౌతమ్ నందా ఫ్లాపవ్వడంతో గోపి-సంపత్ జోడీ మరింత జాగ్రత్తగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
గోపీచంద్ మరియు సంపద జోడి లో వచ్చిన గౌతమ్ నంద మూవీ మంచి సినిమాగా గుర్తింపు తెచ్చుకున్న బాక్సాఫీస్ వద్ద డీలా పడింది. చాలా మంది తర్వాత స్మాల్ స్క్రీన్ లో చూసి ఈ సినిమాను బాగా ఆదరించారు. అయితే ఈసారి బాక్సాఫీస్ వద్ద కూడా హిట్ కొట్టాలనే కసితో గోపీచంద్-సంపత్ జోడి తీవ్రంగా కృషి చేస్తున్నారు.
ఇది ఇలా ఉంటే, మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్లు గోపీ చంద్ ఇంతకుముందు ప్రకటించారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదలైంది. గీతా ఆర్ట్స్ 2- యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి.