భాషతో సంబంధం లేకుండా యావత్ భారతీయ సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తోంది. బాహుబలిలాంటి సూపర్ హిట్ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమాపై సహజంగానే భారీ అంచనాలుంటాయి. అందులోనూ ఈ సినిమాలో టాలీవుడ్ అగ్ర హీరోలు రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లు నటిస్తుండడంతో అంచనాలు మరింత పెరిగాయి. ఈ ఎక్స్పెక్టేషన్స్కు అనుగుణంగానే రాజమౌళి కూడా సినిమాలో భారీ కాస్టింగ్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇందులో భాగంగానే అన్ని సినిమా ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖ నటీ, నటులను ఇందులో నటింపజేస్తున్నారు.
ఇక ఈ సినిమాకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ అయినా ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారుతోంది. ఈ క్రమంలోనే తాజాగా చిత్ర యూనిట్ మరో క్రేజీ అప్డేట్ను ఇచ్చింది. ఆర్.ఆర్.ఆర్‌లో రామ్ చరణ్ అల్లురి సీతా రామరాజు పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే. చెర్రీకి జోడిగా బాలీవుడ్ నటి అలియాభట్ నటిస్తోంది. తాజాగా చిత్ర యూనిట్ అలియాభట్ ఫస్ట్ లుక్ తేదీని ప్రకటించింది. ఇందులో భాగంగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ట్వీట్ చేస్తూ.. ‘మా సీతను పరిచయం చేస్తున్నాం. ఆర్ఆర్ఆర్ సినిమాలో అలియా ఫస్ట్‌లుక్‌ను మార్చి 15న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నాం’ అంటూ క్యా్ప్షన్ జోడించారు. ఇక ఆర్.ఆర్.ఆర్ సినిమాను అక్టోబర్ 13న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే క్లైమాక్స్ చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం గ్రాఫిక్స్ పనులు జరుపుకుంటోంది. సుమారు రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని డీవీవీ ధానయ్య నిర్మిస్తుండగా.. ఎంఎం కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. మరి ఇండియన్ సెల్యులాడ్‌పై ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే విడుదల వరకు వేచి చూడాల్సిందే.
❤❤❤❤❤ https://t.co/ImEhIkATQK
— Alia Bhatt (@aliaa08) March 13, 2021