తాజగా, ఆయన బీజేపీలో చేరబోతున్నరనే విషయం కన్ఫామ్ అయింది. తమ పార్టీలో ఈటల చేరేందుకు బీజేపీ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు ఇతర కీలక నేతలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈరోజు వర్చువల్ గా సమావేశమయ్యారు. బీజేపీలో ఈటల చేరికపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఈ భేటీలో ఈటల చేరికకు నడ్డా పచ్చ జెండా ఊపారు. బీజేపీలో ఈటల ఎప్పుడు చేరాలనే విషయాన్ని ఆ పార్టీ రెండు రోజుల్లో ఖరారు చేయనున్నట్టు సమాచారం.
తేదీని బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసిన వెంటనే ఢిల్లీకి ఈటల పయనమవనున్నారు. ఆయనతో పాటు ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కూడా బీజేపీలో చేరనున్నట్టు సమాచారం. ఢిల్లీ పర్యటన తర్వాత ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేస్తారని తెలుస్తోంది.