ట్రిపుల్ ఆర్ సినిమా తాజా పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. ఆ ఫొటోతోనే సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అవగాహన కల్పించాలని సంకల్పించారు. ఇంకేముంది వారి సోషల్ మీడియా విభాగం తాజా పోస్టర్‌లోని ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లకు హెల్మెట్ జోడించి, ‘ఇప్పుడు సరిగ్గా ఉంది. హెల్మెట్ ధరించండి. సురక్షితంగా ఉండండి’ అని క్యాప్షన్ ఇచ్చింది. దీనికి ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ కూడా స్పందించింది. ‘ఇప్పటికీ పర్ఫెక్ట్గా లేదు. నంబర్ ప్లేట్ మిస్సయింది’ అంటూ సమాధానం ఇచ్చింది. అయితే పోస్టర్లో హెడ్‌లైట్ కూడా మిస్ అయిందంటూ నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల వేదికగా ఈ ఫొటో వైరల్ అవుతోంది.
Now it is perfect.
Wear Helmet. Be Safe.@RakeshGoudE @tarak9999 @AlwaysRamCharan @RRRMovie @ssrajamouli @DVVMovies #RRRMovie #JrNTR #RamCharan pic.twitter.com/LDa20NYxCg
— CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) June 29, 2021