ఇది గ్రామీణ నేపథ్యంలో నడిచే కథ. అందువలన పల్లెటూరి అమ్మాయిగానే ఈ సినిమాలో ఆనంది కనిపించనుంది. టైటిల్ కి తగినట్టుగానే ఆమె పాత్రను పరిచయం చేస్తూ ఆనంది లుక్ వదిలారు. ఈ ఫస్టులుక్ లో ఆమె చాలా అందంగా కనిపిస్తూ అలరిస్తోంది. ఈ సినిమాలో సీనియర్ నరేశ్ .. అజయ్ .. రఘుబాబు కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు.
‘ఈ రోజుల్లో’.. ‘బస్టాప్’ వంటి సినిమాలతో తెలుగు తెరపై సందడి చేసిన ఆనంది, ఆ తరువాత తమిళ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడ బిజీ అయింది. జీవీ ప్రకాశ్ కుమార్ తో అక్కడ ఎక్కువ సినిమాలు చేసింది. ‘జాంబి రెడ్డి’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన ఆనంది, ఈ సినిమాతో మరో హిట్ ను అందుకుంటుందేమో చూడాలి.
Quite excited to announce my next #SrideviSodaCenter
Sridevi… #sodalasrideviikkada !!💥@isudheerbabu @70mmEntertains@vijaychilla @Karunafilmmaker @shamdat2
▶️ https://t.co/7SKhkhVnbR— Anandhi (kayal) (@anandhiactress) July 30, 2021