పాపులర్ తమిళ కమెడియన్ వివేక్ గుండెపోటుతో చెన్నైలోని సిమ్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని కొద్ది గంటలు గడిస్తేనే గానీ ఏ విషయం అన్నది చెప్పలేమని వైద్యులు అంటున్నారు.
ప్రస్తుతం వివేక్‌ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రత్యేక వైద్య బృందం వివేక్‌ను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ అందుకు సంబంధించి వైద్యం అందిస్తున్నారు. కాగా ఆయనకు గుండెపోటు రావడం ఇది రెండోసారి.
వివేక్ గురువారం (ఏప్రిల్ 15) సాయంత్రం చెన్నైలోని ఒమండురా గవర్నమెంట్ హాస్పిటల్లో కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్నారు. శుక్రవారం గుండెనొప్పి రావడంతో ఆసుపత్రిలో చేరారాని ఆయన పీఆర్వో మీడియాకు తెలిపారు. వివేక్ త్వరగా కోలుకుని క్షేమంగా మనముందుకు రావాలంటూ పలు భాషలకు చెందిన సినీప్రముఖులు, అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు.