“షడ్రుచుల సమ్మేళనం మా ‘సిద్ధ, నీలాంబరి’ల ప్రేమ.. అందరికీ ఉగాది శుభాకాంక్షలు” అంటూ కొరటాల శివ పేర్కొన్నారు. ట్విట్టర్ లో ఆయన కూడా ఈ పోస్టర్ను షేర్ చేశారు.
ఇంతకు ముందే రామ్ చరణ్ కు సంబంధించిన పలు పోస్టర్లను ఆ సినిమా యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాలో మెడలో రుద్రాక్ష, చెవికి పోగుతో అందులో చెర్రీ కనపడుతున్నాడు. గతంలో చిరు, చెర్రీ ఆర్మీ దుస్తుల్లో ఉన్న ఫొటో కూడా విడుదలైంది. కాగా, ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ నటిస్తోంది. ‘ఆచార్య’ను కొణిదెల ప్రొడెక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
ఆయుధమైనా …అమ్మాయి అయినా … సిద్ధుడి చేతిలో ఒదిగిపోతుంది. #Acharya ఉగాది శుభాకాంక్షలు!!@AlwaysRamCharan @sivakoratala @MatineeEnt @KonidelaPro pic.twitter.com/sW24eo5FJl
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 13, 2021