ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 17న తన 71వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయనకు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 2014లో మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి బీజేపీ ఆయన పుట్టిన రోజును సేవా దివాస్‌గా జరుపుతోంది. దేశవ్యాప్తంగా సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
మోదీ బర్త్ డే సందర్భంగా చిరంజీవి తన ట్విట్టర్లో బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేశారు.గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు. మన దేశ ప్రజలకు సుదీర్ఘకాలం పాటు సేవలందించడానికి మీకు మరింత బలం చేకూరాలని, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను అని చిరు తన ట్వీట్లో పేర్కొన్నారు.
గౌరవనీయులైన పీఎం శ్రీ నరేంద్ర మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీ నాయకత్వంలో దేశ ప్రతిష్టను మరింత ఎత్తుకు తీసుకెళతారని భావిస్తున్నాను అని నాగ్ ట్వీట్ చేశారు.ఇక మహేష్ బాబు.. గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ
నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ సమర్ధవంతమైన నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా. మీరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అని తన ట్వీట్లో పేర్కొన్నారు.