బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా తన అడల్ట్ యాప్ కోసం తనను కూడా అడిగాడని మరో మహిళ చెప్పింది. ఓసారి కుంద్రా తనకు నేరుగా ఇదే విషయం అడుగుతూ మెసేజ్ చేశాడని యూట్యూబర్ పునీత్ కౌర్ వెల్లడించింది. హాట్‌షాట్స్ అనే అడల్ట్ యాప్ కోసం పోర్న్ మూవీస్ తీశాడన్న కేసులో రాజ్‌కుంద్రాను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అతన్ని ఈ నెల 23 వరకూ జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
గతంలో బాలీవుడ్ నటీమణులు పూనమ్ పాండే, సాగరికా షోనా సుమన్ కూడా రాజ్‌కుంద్రాపై ఇలాంటి ఆరోపణలు చేశారు. తాజాగా పునీత్ కౌర్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో రాజ్‌కుంద్రా తనను హాట్‌షాట్స్ గురించి అడిగినట్లు చెప్పింది. అంతేకాదు ఈ విషయంపై తన ఇద్దరు స్నేహితులతో చర్చించిన ఓ వీడియోను కూడా ఆమె బయటపెట్టింది. మొదట్లో తాము రాజ్‌కుంద్రా అకౌంట్ హ్యాక్ అయిందేమో అనుకున్నట్లు పునీత్ చెప్పింది.