‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ప్రకటించిన రోజు నుంచి కూడా ఈ సినిమాపై అక్కినేని అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ టీం విడుదల చేసిన అఖిల్ అక్కినేని ఫస్ట్ లుక్కు, అలానే గోపీ సుందర్ సంగీత సారధ్యంలో హ్యాపెనింగ్ స్టార్ సింగర్ సిద్ శ్రీరామ్ పాడిన మనసా మనసా పాటకు, ఆ తర్వాత విడుదల చేసిన టీజర్‌కు అటు సోషల్ మీడియాలో ఇటు అభిమానుల్లో అనూహ్యమైన స్పందన లభించడం యూనిట్లో కొత్త ఉత్సాహన్ని తెచ్చింది.
ఇదే ఉత్సాహంలో అక్కినేని అభిమానులకు మరో స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు దర్శక నిర్మాతలు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలోని ఏ జిందగీ పాటను విడుదల చేసారు. ఈ పాటకు మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈ పాటను మలయాళీ ఇన్ఫ్లూయెన్సర్ పాడారు. ఓ మలయాళీ ఇన్‌ఫ్లూయెన్సర్‌కు పాట పాడే అవకాశం ఇచ్చిన మొట్టమొదటి బ్యానర్ గీతా ఆర్ట్స్ 2. ఆ అమ్మాయి పేరు నఫీసా హాన్యా.
విడుదలైన క్షణం నుంచి కూడా ఏ జిందగీ పాటకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తుంది. ఈ సినిమాను జూన్ 19న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు యూనిట్. దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ తన చిత్రాల్లోని పాత్రల్ని చాలా క్యూట్ రొమాన్స్‌తో లవ్ లీగా వుండేలా డిజైన్ చేస్తారు. ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో కూడా అఖిల్ అక్కినేని, పూజాల మధ్య కూడా అలాంటి కెమిస్ట్రి ఉండేలా డిజైన్ చేసారు.