స్టార్ కథానాయకులు… అప్పుడప్పుడూ బుల్లితెర మీద సందడి చేయడానికి ఉత్సాహం చూపిస్తుంటారు. కార్యక్రమ నిర్వాహకులుగా, యాంకర్‌గా ప్రతిభను చాటుకుంటుంటారు. ఇప్పుడు హాలీవుడ్ సూపర్‌స్టార్ విల్‌స్మిత్ ఇదే బాట పట్టారు. ఇప్పటికే అతను నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ ప్రసారం చేసే ఓ డాక్యుమెంటరీకి వ్యాఖ్యాతగా చేశాడు. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌కు విల్‌స్మిత్ ఓ కామెడీ టాక్‌షో నిర్వహించనున్నారు. ఇది ఈ ఏడాది ద్వితీయార్ధంలో ప్రారంభం కానుంది. ‘‘విల్‌స్మిత్ షో త్వరలోనే మీ ముందుకు రానుంది. తారలతో కబుర్లు, కామెడీ స్కిట్లు, సంగీతం ఉంటాయి’’ అని నెట్‌ఫ్లిక్స్ బృందం సామాజిక మాధ్యమాల్లో చెప్పుకొచ్చింది.