తమిళనాడు సీఎంగా మొట్టమొదటిసారి బాధ్యతలు స్వీకరించిన డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ పాలనలో తనదైన ముద్ర వేసేందుకు శ్రమిస్తున్నారు. పాలనలోనే కాదు, ఆయన ఆరోగ్య పరిరక్షణ కోసం జిమ్ లోనూ శ్రమిస్తున్నారు. తాజాగా స్టాలిన్ జిమ్ లో వర్కౌట్లు చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది. శారీరక దారుఢ్యం కోసం కాస్త కఠినమైన వర్కౌట్లు చేస్తూ స్టాలిన్ దర్శనమిచ్చారు. ఆయన వయసు 68. కానీ ఎంతో కుర్రాడిలా ఆయన ఫిజికల్ ఫిట్నెస్ వ్యాయాయాలు చేస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
రాజకీయాలతో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ, స్టాలిన్ దినచర్యలో వ్యాయామం తప్పనిసరిగా ఉంటుంది. యోగా, వాకింగ్, సైక్లింగ్, జిమ్ వర్కౌట్స్… ఇలా ఏదో ఒక రూపంలో శారీరక కసరత్తులు చేస్తారు.
MK Stalin Workout Video | முதலமைச்சர் மு.க.ஸ்டாலின் தீவிர உடற்பயிச்சி | #shorts#MKStalin | #Workout | #TNChiefMinister | #Tamilnadu pic.twitter.com/5SrMRZ9hlW
— IBC Tamil (@ibctamilmedia) August 21, 2021