రీసెంట్గా ‘A1 ఎక్స్‌ప్రెస్’ మూవీతో మంచి హిట్ అందుకున్నాడు యంగ్ హీరో సందీప్ కిషన్.. ఇది నటుడిగా తనకి 25వ సినిమా.. ఇప్పుడు ‘తెనాలి రామకృష్ణ BA.BL’ వంటి ఫన్ ఎంటర్టైనర్ తర్వాత కామెడీ సినిమాల స్పెషలిస్ట్ జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో మరో చిత్రం చేస్తున్నాడు.
ఈ సినిమాకి ‘గల్లీ రౌడీ’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. నేహా శెట్టి కథానాయిక.. నేషనల్ అవార్డ్ విన్నర్ బాబీ సింహా ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. కోన ఫిలిం కార్పొరేషన్, ఎమ్వివి సినిమాస్ బ్యానర్లపై కోన వెంకట్, ఎమ్వివి సత్యనారాయణ కలిసి నిర్మిస్తున్నారు.. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ‘గల్లీ రౌడీ’ టీజర్ రిలీజ్ చేశారు.
టీజర్లో నాగేశ్వర్ రెడ్డి మార్క్ కనిపించింది.. సందీప్ సరికొత్త గెటప్‌లో ఆకట్టుకున్నాడు.. ‘బాబు రావాలి.. రౌడీ కావాలి అని విశాఖపట్నం ప్రజలంతా ఎదురు చూస్తున్నారు’ అంటూ పోసాని, హీరో గురించి బిల్డప్ ఇవ్వడం, హీరోయిన్, హీరో చేత కిడ్నాప్ చేయించడానికి రెచ్చగొట్టడం.. అంతా ఫన్నీగా చూపించారు. టీజర్ చివర్లో మీతాత నిన్ను రౌడీని ఎందుకు చేశాడు అంటే సందీప్ కిషన్ నెపోటిజం అని చెప్పడం హైలెట్ అసలు.. విజువల్స్, ఆర్ఆర్ చక్కగా సరిపోయాయి.. త్వరలో ‘గల్లీ రౌడీ’ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది..
Launching the teaser of #GullyRowdy 😊https://t.co/gMz9WrQCIa
A movie that was made to make you laugh! I wish the team behind it, my man @sundeepkishan, @konavenkat99 sirrr and everyone all laughter, happiness and success!
Big hugs and love from me 🤗🤍
— Vijay Deverakonda (@TheDeverakonda) April 19, 2021