పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేస్తున్న చిత్రం లైగర్ . పాన్ ఇండియా కథాంశంతో బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. బాలీవుడ్ భామ అనన్యపాండే ఈ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయం అవుతుంది. కాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఆసక్తికర అప్ డేట్ బయటకు వచ్చింది. యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ మూవీ కొత్త షెడ్యూలు చిత్రీకరణ నేడు షురూ అయింది.
విజయ్ దేవరకొండ కండలు తిరిగిన శరీర సౌష్ఠవంతో రింగ్‌లో కూర్చొని ఉన్న స్టిల్ ను మేకర్స్ విడుదల చేశారు. విజయ్ దేవరకొండ తన ప్రత్యర్థితో రింగ్ లో తలపడుతుండగా తీసినట్టుగా తాజాగా విడుదల చేసిన లుక్ ఉంది. లైగర్ చిత్రీకరణ చివరి దశలో ఉంది. కాగా ఈ ఏడాది చివరలో విడుదల చేసేందుకు పూరీ అండ్ టీం సన్నాహాలు చేస్తోంది. పూరీ జగన్నాథ్, ఛార్మీ, బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్, అపూర్వ మెహతా సంయక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తున్నారు. 2020లోవరల్డ్ ఫేమస్ లవర్ బాక్సాపీస్ వద్ద బోల్తా కొట్టడంతో..ఈ సారి లైగర్ తో ఎలాగైనా మంచి హిట్టు కొట్టాలని కసిగా ఎదురుచూస్తున్నాడు విజయ్ దేవరకొండ.
BLOOD. SWEAT. VIOLENCE. #LIGER Shoot Resumes. pic.twitter.com/x2wJVuDByd
— Vijay Deverakonda (@TheDeverakonda) September 15, 2021