ముందుగా ఈ సినిమాను ‘దీపావళి’ కానుకగా నవంబర్ 4వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. కానీ ఆ తరువాత వాయిదా వేసుకున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి ‘గని’ ఫస్టు పంచ్ పేరుతో ఒక వీడియోను వదిలారు. అంతేకాదు ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా చెప్పేశారు. ఈ సినిమాను డిసెంబర్ 3వ తేదీన విడుదల చేయనున్నారు. డిసెంబర్ మాసంలోకి మరో కొత్త సినిమా ఎంటర్ అయింది. ఆ నెలలో కూడా పోటీ గట్టిగానే ఉండనుందని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం వరుణ్ తేజ్ ‘ఎఫ్ 3’ సినిమా షూటింగులో బిజీగా ఉన్నాడు. అనిల్ రావిపూడి చాలా స్పీడ్ గా ఈ సినిమా షూటింగును కానిచ్చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు.