తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. నాయకా నాయికలకి సంబంధించిన సన్నివేశాలపై కట్ చేసిన ఈ టీజర్ బావుంది. అందం .. ఆత్మాభిమానం .. కాస్త అహంభావం ఉన్న పాత్రలో రీతూ వర్మ పాత్రను చూపించనున్నట్టు అర్థమవుతోంది. సహనంతో ఆమెను లైన్లో పెట్టే పనిలో ఉన్నవాడిగా కథానాయకుడు కనిపిస్తున్నాడు.
“ఆ అందం .. ఆ పొగరు .. ఆర్డర్ ఇచ్చి చేయించినట్టుగా ఉంది” .. “మీ బాస్ ఏంటి భయ్యా ఎడారిలో ఐస్ తయారు చేద్దామని చూస్తున్నాడు” అనే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. నదియా .. వెన్నెల కిషోర్ .. మురళీశర్మ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. అక్టోబర్లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.