పవర్ స్టార్ పవన్ తన ఫ్యాన్స్ కి హోలీ స్పెషల్ ప్రకటించాడు. హోలీ సందర్భంగా ట్రీట్ ఇవ్వబోతున్నారు.`వకీల్‌సాబ్` ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించారు.హోలీ సందర్భంగా ఈ నెల 2న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్‌రాజు,శిరీష్ సంయుక్తంగా బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు.ఈ సినిమా ఏప్రిల్ 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.
ఈ నేపథ్యంలో ఇప్పటికే చిత్ర ప్రమోషన్ స్టార్ట్ చేశారు. మ్యూజికల్ ఫెస్ట్ పేరుతో ఈవెంట్లు నిర్వహిస్తూ సినిమాపై క్రేజ్‌ని పెంచుతున్నారు.అందులో భాగంగా తాజాగా ఓ కొత్త పోస్టర్ని విడుదల చేశారు. ఇందులో లాయర్ గెటప్ లో పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న `వకీల్ సాబ్` పై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ట్రైలర్ కూడా అంచనాలను మరింత పెంచేదిలా ఉంటుందని నమ్ముతున్నారు మేకర్స్.
ఈ చిత్రంలో శ్రుతి హాసన్, నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల ఇతర తారాగణంగా నటిస్తున్నారు….