మొదటి సినిమా అనేది హీరోల కెరీర్ చాలా ముఖ్యమైంది. ఇక అగ్ర హీరోల ఫ్యామిలీ నుంచి వచ్చే హీరోలైతే ఎంత జాగ్రత్తగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే అందరి చూపు ఆ సినిమాపైనే ఉంటుంది. మొదటి సినిమా క్లిక్కయితేనే భవిష్యత్తుకు ఒక మంచి రూట్ సెట్టవుతుంది. అందుకే వీలైనంత సేఫ్ జోన్ లోనే కథను ఎంచుకోవడానికి ట్రై చేస్తారు. అయితే మెగా హీరో వైష్ణవ్ తేజ్ మాత్రం భారీ రిస్క్ తో కూడిన కథను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ఉప్పెన సినిమాపై ఓ వర్గం ఆడియేన్స్ లో అంచనాలు అయితే భారీగానే ఉన్నాయి.
అయితే ఆ సినిమో ఒక ట్విస్ట్ ఊహించని విధంగా ఉంటుందని గత కొంతకాలంగా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సినిమా మూడ్ ను మొత్తం ఒక్కసారిగా చేంజ్ చేసే ఆ ట్విస్ట్ ఏ మాత్రం తేడా కొట్టినా కూడా చాలా కష్టమని రూమర్స్ కూడా వస్తున్నాయి. విజయ్ సేతుపతి ఇందులో విలన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఓ వర్గం ఆడియెన్స్ అయితే అతనిపై కూడా చాలా ఫోకస్ పెట్టారు. గురువారం విడుదల కాబోయే ట్రైలర్ లో అతని పాత్రను కూడా చూపించబోతున్నారు. సినిమాపై హైప్ మరింత పెరగడం కాయమని తెలుస్తోంది.
విలన్ కూతురినే హీరో ప్రేమిస్తాడట. అయితే సినిమాలో కొంతవరకు రొటీన్ ఫార్ములా అయినప్పటికీ హిరోకు విలన్ కలిగించే నష్టం ఊహించని విధంగా ఉంటుందని కామెంట్స్ వస్తున్నాయి . ఇప్పటివరకు అలాంటి ట్విస్ట్ తెలుగు సినిమాల్లోనే ఎవరు చూసి ఉండరని రూమర్స్ వస్తున్నాయి. సినిమా కథను ఓకే చేయడానికి కారణం కూడా అదేనట. దర్శకుడు సుకుమార్ అందించిన స్క్రిప్ట్ కాబట్టి ట్విస్ట్ బలంగా ఉంటుందని చెప్పవచ్చు. మరి సినిమా ఆడియెన్స్ కు ఎంతవరకు కనెక్ట్ అవుతుందో చూడాలి.