సాహు గారపాటి – హరీశ్ పెద్ది నిర్మించిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు సన్నాహాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ – నోవాటెల్ హోటల్లో రేపు సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక ప్రారంభం కానుంది. తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాకి, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను గోపీసుందర్ అందించాడు.
గ్రామీణ నేపథ్యంలో కుటుంబాలు .. బంధాలు చుట్టూ ఈ కథ తిరుగుతుంది. రీతూ వర్మ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, నానీకి అన్నయ్యగా జగపతిబాబు నటించారు. యాక్షన్ .. ఎమోషన్ పాళ్లు పుష్కలంగా ఉన్న ఈ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.